దొంగ టీచర్ అరెస్ట్ | Teacher arrest on robbery case | Sakshi
Sakshi News home page

దొంగ టీచర్ అరెస్ట్

Sep 21 2013 12:19 PM | Updated on Sep 27 2018 5:29 PM

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారి తప్పి దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జైలు ఊచల్ని లెక్కిస్తున్నాడు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే దారి తప్పి దొంగతనాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం జైలు ఊచల్ని లెక్కిస్తున్నాడు. తమళనాడులోని వేలూరు జిల్లాలో మదన్ మారన్ (34) అనే వ్యక్తి స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. తొందరగా ధనవంతుడు కావాలనే దురాశతో చిల్లర దొంగతనాలకు పాల్పడ్డాడు. 73 విలువైన బంగారు ఆభరణాలను తస్కరించాడు. వీటి విలువ దాదాపు 20 లక్షల రూపాయలు ఉంటుంది. శుక్రవారం రాత్రి పోలీసులు మారన్ను అరెస్ట్ చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై గతంలోనూ దొంగతనం తదితర కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. 2004లో మారన్ హోసూర్ సమీపంలోని ఓ గ్రామీణ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆయనపై దొంగతనం కేసు నమోదవడంతో గతేడాది ఉద్యోగం నుంచి తొలగించారు. రెణ్నెళ్ల క్రితం వేలూరు వెళ్లి ఓ పాఠశాలలో టీచర్గా చేరాడు. దొంగతనాలకు అలవాటు పడ్డ మారన్ అక్కడా అదే ప్రయత్నం చేస్తూ పోలీసులకు దొరికిపోయాడు. ఆయన పది రోజులు సెలవు పెట్టి పక్క జిల్లా కాంచీపురానికి దొంగతనం చేయడానికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం 18 కేసులు నమోదయ్యాయని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement