కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం | TDP MLA Revanth reddy at KCR's village | Sakshi
Sakshi News home page

కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం

Apr 19 2017 8:10 PM | Updated on Aug 14 2018 11:02 AM

కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం - Sakshi

కేసీఆర్ స్వగ్రామంలో రేవంత్‌కు చేదు అనుభవం

కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

సిద్ధిపేట: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్వగ్రామం చింతమడకలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సిద్ధిపేట రూరల్‌ మండలంలోని చింతమడకలో ఇటీవలే ఓ రైతు ఆత్మహత్యకుపాల్పడ్డారు. ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకుగానూ రేవంత్ బుధవారం చింతమడకకు బయలుదేరారు.

టీడీపీ ఎమ్మెల్యే రాకను నిరసిస్తూ చింతమడక గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకుదిగారు. రేవంత్ ఊర్లోకి రాకుండా రహదారిపై టైర్లు, ముళ్లకంపలను పేర్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. చింతమడకకు రెండు కిలోమీటర్ల దూరంలోనే రేవంత్ రెడ్డి కారును ఆపేశారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్నందున పర్యటన మానుకోవాలని పోలీసులు చేసిన అభ్యర్థనను రేవంత్ తృణీకరించారు. టూ వీలర్‌ ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మళ్లీ అడ్డుకున్నారు. చివరికి రేవంత్ కాలినడకన చింతమడక వైపునకు కదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement