ఆ వివాదంలో టీసీఎస్కు ఊరట | TCS settles Orange County lawsuit for usd 26 million | Sakshi
Sakshi News home page

ఆ వివాదంలో టీసీఎస్కు ఊరట

Aug 24 2016 1:40 PM | Updated on Aug 24 2018 4:15 PM

అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మూడు ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. సుమారు 175 కోట్లను చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ముంబై:  అతిపెద్ద ఐటి సేవల సంస్థ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  (టీసీఎస్)  మూడు ఏళ్లుగా సాగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.    సుమారు 175 కోట్లను చెల్లించేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.   ఆరెంజ్ కౌంటీ,  టీసీఎస్ జాయింట్  డెవలప్మెంట్  ద్వారా ఆటోమేటెడ్ ఇన్ కమ్ టాక్స్ సిస్టం   రిప్లేస్మెంట్  సందర్భంగా ఈ వివాదం తలెత్తింది.  దీంతో 2013 లో ఆరెంజ్ కౌంటీ  టీసీఎస్ పై దావా  వేసింది.  మూడు సంవత్సరాలు సాగిన ఈ  వివాదంలో  26 మిలియన్ల డాలర్లకు (రూ.1,74, 57, 70, 000) అమెరికా ఆరెంజ్ కౌంటీ తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికి ఇరు పార్టీలు అంగీకరించామని టీసీఎస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు

కాంట్రాక్ట్ విలువ రూ.6.4 మిలియన్ డాలర్లతో పోలిస్తే తాజా  సెటిల్ మెంట్  విలువ నాలుగు రెట్లు ఎక్కువనీ,  నిజానికి తాము ఐదు రెట్లు మొత్తాన్ని టాటాకి చెల్లించినట్టు  ఆరెంజ్ కౌంటీ  ప్రతినిధి ఒక ప్రకటనలో చెప్పారు.

అమెరికాలోని ఆరెంజ్ కౌంటీ, టీసీఎస్ ఉమ్మడి భాగస్వామ్యంతో  ఆస్తి పన్ను నిర్వహణ వ్యవస్థ రీప్లేస్ మెంట్ కు కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఈ ఒప్పందం 2010లోనే  ముగిసినప్పటికీ  జారీ చేయలేదు.  దీంతో ఆరెంజ్  కౌంటీ  కోర్టుకెక్కింది.  చివరికి  26 మిలియన్ డాలర్ల చెల్లించేందుకు  టీసీఎస్  అంగీకరించడంతో  ఈ వివాదానికి తెరపడింది .

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement