లాభాల్లో ఎగిసిన టెక్ దిగ్గజం టీసీఎస్ | TCS reports net profit of Rs 6,586 crore in September quarter | Sakshi
Sakshi News home page

లాభాల్లో ఎగిసిన టెక్ దిగ్గజం టీసీఎస్

Oct 13 2016 5:28 PM | Updated on Sep 4 2017 5:05 PM

లాభాల్లో ఎగిసిన టెక్ దిగ్గజం టీసీఎస్

లాభాల్లో ఎగిసిన టెక్ దిగ్గజం టీసీఎస్

దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ గురువారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.

దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ గురువారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన రెండో క్వార్టర్లో నికరలాభాలు 4 శాతం ఎగిసి రూ.6,528కోట్లగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్లో ఈ లాభాలు కేవలం రూ.6317కోట్లు మాత్రమే. అయితే డాలర్ రెవెన్యూలు మార్కెట్ విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయినట్టు కంపెనీ తన ఫలితాల్లో పేర్కొంది. క్వార్టర్లీ బేసిస్తో ఈ రెవెన్యూలు కేవలం 0.3 శాతం మాత్రమే పెరిగి 4374 మిలియన్ డాలర్లుగా రికార్డు అయినట్టు వెల్లడించింది.  ఈ రెండో త్రైమాసికాన్ని అసాధారణమైన క్వార్టర్గా కంపెనీ సీఈవో, ఎండీ ఎన్.చంద్రశేఖర్ అభివర్ణించారు. ప్రపంచ వాతావరణంలో పెరుగుతున్న అనిశ్చితుల దృష్ట్యా వినియోగదారులు జాగ్రత్త వహించినట్టు, లాటిన్ అమెరికా, భారత్ వంటి మార్కెట్లలో రెవెన్యూ వృద్ధి స్తబ్దుగా ఉన్నట్టు చెప్పారు. లాభాల పరంగా తీసుకుంటే ఇది మంచి త్రైమాసికమేనని ఆయన పేర్కొన్నారు.
 
అమెరికా వంటి కీలక వ్యాపార ప్రాంతంలో అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే జులై-సెప్టెంబరులో నష్టాలు నమోదుకావొచ్చని కంపెనీతో పాటు మార్కెట్ విశ్లేషకులు పెట్టుబడిదారులకు ముందస్తు హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో కంపెనీ నికరలాభాలు కూడా కేవలం రూ.6,298 కోట్లకు పరిమితమవుతాయని విశ్లేషకులు అంచనావేశారు. వారి అంచనాలను అధిగమించి కంపెనీ లాభాలను ప్రకటించింది. లాభాల ప్రకటన నేపథ్యంలో కంపెనీ ఒక్కో షేరుకు 6.50 పైసల మధ్యంతర డివిడెంట్ను ప్రకటించింది. కాగ ఈ  ఫలితాలు మార్కెట్ ముగిసిన అనంతరం విడుదల అయ్యాయి. ఫలితాల నేపథ్యంలో నేటి మార్కెట్లో కంపెనీ షేరు 2.17 శాతం పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement