7 శాతం పెరిగిన టాటా మోటార్స్ స్పీడ్ | Tata Motors sales surges 7% in April | Sakshi
Sakshi News home page

7 శాతం పెరిగిన టాటా మోటార్స్ స్పీడ్

May 3 2015 12:35 AM | Updated on Sep 3 2017 1:18 AM

7 శాతం పెరిగిన టాటా మోటార్స్ స్పీడ్

7 శాతం పెరిగిన టాటా మోటార్స్ స్పీడ్

టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో 7 శాతం పెరిగాయి. కంపెనీ శనివారం విడుదల

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు ఏప్రిల్‌లో 7 శాతం పెరిగాయి. కంపెనీ శనివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం...
 ఏప్రిల్‌లో కంపెనీ 36,205 వాహనాలను విక్రయించింది. 2014 ఇదే నెలలో ఈ విక్రయాల సంఖ్య 33,962.
 దేశీయంగా వాణిజ్య, పాసింజర్ వాహన విక్రయాలు 5 శాతం పైగా పెరిగి 30,740 యూనిట్ల నుంచి 32,419 యూనిట్లకు ఎగశాయి.
 దేశంలో ఒక్క పాసింజర్ వాహన అమ్మకాలు చూస్తే 37 శాతం పెరిగి 7,441 యూనిట్ల నుంచి 10,230 యూనిట్లకు చేరాయి.
 అయితే దేశంలో కమర్షియల్ వాహన విక్రయాలు ఐదు శాతం తగ్గి, 22,189గా రికార్డయ్యాయి.
 ఏప్రిల్‌లో ఎగుమతులు 18 శాతం పెరిగి 3,222 యూనిట్ల నుంచి 3,786 యూనిట్లకు చేరాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement