ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్షీట్ | Tarun Tejpal sexual assault case: Goa Police to file chargesheet by Feb 5 | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్షీట్

Jan 28 2014 1:28 PM | Updated on Sep 2 2017 3:06 AM

ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్షీట్

ఫిబ్రవరి 5న తరుణ్ తేజ్పాల్పై ఛార్జ్షీట్

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు.

పనాజి : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్పై వచ్చేవారం ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు గోవా పోలీసులు తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తి అయ్యిందని... ఫిబ్రవరి 5న ఛార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. గోవాలోని ఓ రిసార్టులో థింక్ఫెస్ట్ జరుగుతున్న సమయంలో తన సహోద్యోగి ఒకరిపై ఆయన అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

తరుణ్ తేజ్పాల్ ప్రస్తుతం వాస్కోలోని ఓ సబ్ జైలులో ఖైదీ నెంబర్ 624గా కాలం గడుపుతున్నారు. సంచలనాత్మక కథనాలతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధికెక్కిన తెహల్కా పత్రికను విజయవంతంగా నడిపిన తరుణ్ తేజ్పాల్, ఇలాంటి ఆరోపణలకు గురికావడం చర్చకు దారితీసింది. మరోవైపు  కటకటాల్లో ఉన్న తేజ్పాల్ బెయిల్ పిటిషన్ను  గోవా కోర్టు విచారించింది. ఈ కేసులో ఆయన గత సంవత్సరం నవంబర్ 30వ తేదీన అరెస్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటికి  ఆయన జైలు ఊచలు లెక్కపెడుతూనే ఉన్నారు. ఇందులో కొన్నాళ్లు పోలీసు కస్టడీ, మరికొన్నాళ్లు జ్యుడీషియల్ కస్టడీ అనుభవించారు.

Advertisement
 
Advertisement
Advertisement