వ్యాపారాలకు అనువైన దేశాల్లో భారత్‌ను మెరుగైన స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: వ్యాపారాలకు అనువైన దేశాల్లో భారత్‌ను మెరుగైన స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారని ప్రవాస భారతీయ పారిశ్రామిక దిగ్గజం లార్డ్ స్వరాజ్ పాల్ ప్రశంసించారు. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఇందుకు నిదర్శనమన్నారు. యూనివర్సిటీ ఆఫ్ వోల్వర్‌హాంప్టన్‌లో జరిగిన కార్యక్రమంలో చాన్సలర్ హోదాలో పాల్గొన్న సందర్భంగా పాల్ ఈ విషయాలు తెలిపారు. భారత మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో తాము కూడా తోడ్పాటు అందిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వర్సిటీ పోషించతగిన పాత్రపై ఇటీవలే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీతో చర్చించినట్లు ఆయన వివరించారు.