ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట | supreme court rejects petition filled by ap, telangana states | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట

Sep 30 2015 3:23 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం కేసులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం కేసులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలిన సుప్రీం కోర్టు ఆదేశించింది. పదోన్నతులకు 371 డి సవరణల కోసం రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని తెలుగు రాష్ట్రాలకు సూచించింది.

పంచాయతీ రాజ్‌, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీచర్లందరికీ ఏకీకృత సర్వీసు రూల్స్‌ తీసుకొస్తూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చర్యలు చేపట్టింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వ ఉపాధ్యాయులకు అనుకూలంగా వచ్చింది. కొన్నేళ్లుగా  ఈ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.  సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట లభించగా, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు చుక్కెదురు అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement