మిజోరంలో అభ్యర్థులు సామాజిక మీడియా ఫేస్‌బుక్, మొబైల్ ఫోన్ సంక్షిప్త సందేశాల(ఎస్‌ఎంఎస్) ద్వారా తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ యువతను ఆకట్టుకునే పనిలోపడ్డారు.
ఐజ్వాల్: మిజోరంలో అభ్యర్థులు సామాజిక మీడియా ఫేస్‌బుక్, మొబైల్ ఫోన్ సంక్షిప్త సందేశాల(ఎస్‌ఎంఎస్) ద్వారా తమదైన శైలిలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ యువతను ఆకట్టుకునే పనిలోపడ్డారు. ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్న వారిలో జోరం నేషనలిస్ట్ పార్టీ(జెడ్‌ఎన్‌పీ) చీఫ్ లాల్‌దుహామా, రాష్ట్ర క్రీడల మంత్రి జొడింట్లాంగాలు ముందువరుసలో ఉన్నారు. అధికార కాంగ్రెస్, విపక్ష మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్‌ఎఫ్) లోని యువనేతలు కూడా సామాజిక మాధ్యమాలనే వేదికలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు.