శశి థరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు | Sunanda Pushkar death: Police to question Shashi Tharoor | Sakshi
Sakshi News home page

శశి థరూర్‌ను ప్రశ్నించనున్న పోలీసులు

Jan 23 2014 2:13 AM | Updated on Aug 21 2018 5:44 PM

అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సునందా పుష్కర్ కేసులో ఆమె భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో పాటు ఆమె బంధువులను పోలీసులు విచారించే అవకాశం ఉంది.

న్యూఢిల్లీ: అనుమానాస్పద రీతిలో మృతి చెందిన సునందా పుష్కర్ కేసులో ఆమె భర్త, కేంద్ర మంత్రి శశి థరూర్‌తో పాటు ఆమె బంధువులను పోలీసులు విచారించే అవకాశం ఉంది. మంగళవారం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ సునంద మృతిని హత్య లేదా ఆత్మహత్య కోణంలో విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించిన నేపథ్యంలో, వారు కేంద్ర మంత్రిని విచారణలో పాల్గొనాల్సిందిగా కోరడానికి సిద్ధమవుతున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం కేంద్ర మంత్రితో పాటు మరో 11 మందికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని సమాచారం. కాగా, తన తల్లి ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదని సునంద కుమారుడు శివ్ మీనన్ చెప్పారు. మీడియా వార్తలతో ఒత్తిడికి లోనవడం, తప్పు డు విధంగా వివిధ మందులను కలిపి వాడడం సునంద మృతి చెందారని తెలిపారు. అప్పుడప్పుడు గొడవపడినా శశి థరూర్, తన తల్లిని ప్రేమగానే చూసుకునేవారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement