'సుల్తాన్' షేప్ కోసం పూజలు | 'Sultan' inspires pehalwans of Kanpur offer prayers to Salman | Sakshi
Sakshi News home page

'సుల్తాన్' షేప్ కోసం పూజలు

Aug 1 2016 12:46 PM | Updated on Sep 4 2017 7:22 AM

'సుల్తాన్' షేప్ కోసం పూజలు

'సుల్తాన్' షేప్ కోసం పూజలు

'సుల్తాన్' షేప్ కోసం ఉత్తరప్రదేశ్ కు చెందిన పహిల్వాన్లు సల్మాన్ ఖాన్ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు..

కాన్పూర్: జస్ట్ చొక్కా విప్పి కండలు చూపెడితేనే సల్మాన్ ఖాన్ సినిమాలు రికార్డులు బద్దలవుతాయి. అలాంటిది ఈ సారి ప్యాంటు కూడా తీసేసి 'సుల్తాన్'గా లంగోటాతో బరిలోకి దిగి, బాక్సాఫీసును షేక్ చేశాడు. ఆ  సినిమా కలెక్షన్లు రూ.500 కోట్లకు చేరువయ్యాయి. లేటు వయసులోనూ చక్కటి శరీర సౌష్టవంతో ఫ్యాన్స్ ను అలరిస్తున్న సల్మాన్ ఖాన్.. ఫిట్ నెస్ విషయంలో ఎందరికో స్పూర్తి.

ఇక ఉత్తరప్రదేశ్ లోనైతే కొందరు పహిల్వాన్లు 'సుల్తాన్' షేప్ కోసం కసరత్తులతోపాటు ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు.  కాన్పూర్ (యూపీ)లోని చందు అఖడ్ (వ్యాయామశాల)కు చెందిన పహిల్వాన్లు ఇటీవలే 'సుల్తాన్' సినిమా చూశారట. తర్వాతి రోజునుంచే.. ఫిట్ నెస్ కోసం సల్మాన్ సినిమాలో ఏమేం చేశాడో అన్ని ఫీట్లూ ప్రాక్టీస్ చేస్తున్నారు వీళ్లు. ఈ తతంగానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రాక్టీస్ వరకు సరేగానీ సల్మాన్ కు పుజల విషయంలోనే వీరిపై విమర్శలు చెలరేగాయి.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement