పాక్లో ఆత్మహుతి దాడి: ఇద్దరు భద్రత సిబ్బంది మృతి | Suicide bombing kills 2 soldiers in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్లో ఆత్మహుతి దాడి: ఇద్దరు భద్రత సిబ్బంది మృతి

Nov 20 2013 12:08 PM | Updated on Sep 2 2017 12:48 AM

ఉత్తర వజీరిస్థాన్లోని బన్ను- మీర్ అలీ రహదారిలో ష్వా చెక్పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఆత్మాహుతి జరిపిన దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది.

ఉత్తర వజీరిస్థాన్లోని బన్ను మీర్ అలీ రహదారిలో ష్వా చెక్పోస్ట్ వద్ద ఈ రోజు ఉదయం ఆత్మాహుతి జరిపిన దాడిలో ఇద్దరు భద్రత సిబ్బంది మరణించారని స్థానిక మీడియా బుధవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని, పోలీసులు వెంటనే స్పందించి స్థానికుల సహాయంతో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది.

 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి తన వాహనాన్ని చెక్పోస్ట్ వద్ద పేల్చేయడంతో ఆ ఘటన చోటు చేసుకుందని చెప్పింది. ఆ ఘటనకు తామే బాధ్యులమని అన్సరుల్ ముజాహిదీన్ ప్రకటించిందని వివరించింది. అయితే భద్రత సిబ్బంది స్థానికంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపింది. పాకిస్థాన్లోని తాలిబాన్కు గట్టి పట్టున్న ప్రాంతం వజీరిస్థాన్.



అలాగే ఖైబర్ పక్త్వా ప్రావెన్స్లోని స్వాబి జిల్లాలో భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు తీవ్రవాదులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. స్వాబిలోని నతియన్ పోలీస్ చెక్పోస్ట్పై దాదాపు డజన్ మంది తీవ్రవాదులు ముకుమ్మడి దాడి చేశారు. దాంతో వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఎదురు కాల్పులు జరిపారు. దాంతో నలుగురు వ్యక్తులు మరణించారు.

Advertisement

పోల్

Advertisement