ఎన్కౌంటర్లో తొమ్మిది మంది తీవ్రవాదుల హతం | Nine militants killed in attack in Pakistan | Sakshi
Sakshi News home page

ఎన్కౌంటర్లో తొమ్మిది మంది తీవ్రవాదుల హతం

Oct 29 2013 2:29 PM | Updated on Sep 2 2017 12:06 AM

పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్లో నిన్న రాత్రి భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారు.

పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతమైన ఉత్తర వజీరిస్థాన్లో నిన్న రాత్రి భద్రత దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది తీవ్రవాదులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం ఇక్కడ వెల్లడించింది. ఆర్మీ చెక్ పోస్ట్పై తీవ్రవాదులు ఆకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఆర్మీ సిబ్బంది వెంటనే తెరుకుని కాల్పులు జరిపిందని వివరించింది. అయితే ఆ ఘటనలో ఆర్మీ సిబ్బందికి ఎటువంటి గాయాలైనట్లు సమాచారం అందలేదని పేర్కొంది.

 

అలాగే దక్షిణ వజీరిస్థాన్లో ఆర్మీ సిబ్బందితో వెళ్తున్న కాన్వాయిని లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు మందు పాతర పేల్చారు. ఆ దుర్ఘటనలో ముగ్గురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు ఘటనలకు తామే బాధ్యులమని ఇంత వరకు ఏ తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని స్థానిక మీడియా పేర్కొంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement