ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉబర్ డ్రైవర్! | Story About IIT Grad, Now Bengaluru Cab Driver, Goes Viral | Sakshi
Sakshi News home page

ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉబర్ డ్రైవర్!

Jul 5 2016 8:37 PM | Updated on Aug 30 2018 9:05 PM

ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉబర్ డ్రైవర్! - Sakshi

ఐఐటీ గ్రాడ్యుయేట్.. ఉబర్ డ్రైవర్!

ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆనంద్.. శ్రీకాంత్ తో జరిపిన సంభాషణ ఆయనలో స్పూర్తిని నింపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

బెంగళూరు: నగరానికి చెందిన శ్రీకాంత్ సింగ్ ఓ ఐటీ కంపెనీలో మేనేజర్. ఈ నెల 2వ తేదీన ఆఫీసులో పని ఎక్కువగా ఉండటం వల్ల అర్ధరాత్రి ఇంటికి వెళ్లాల్సివచ్చింది. దాంతో ఉబర్ క్యాబ్ ను బుక్ చేశాడు. కొద్దిసేపటికి ఆఫీసు బయటకు వచ్చిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఆనంద్.. శ్రీకాంత్ తో జరిపిన సంభాషణ ఆయనలో స్పూర్తి నింపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సంభాషణ
ఆనంద్ : 'హాయ్ సార్! హో ఆర్ యూ?' అంటూ సూపర్బ్ ఫ్లూయంట్ ఇంగ్లీష్ తో పలకరించాడు.

శ్రీకాంత్ : కొంచెం ఆశ్చర్యపోయిన శ్రీకాంత్, ఐయామ్ గుడ్ థాంక్యూ సార్. కారులోకి ఎక్కిన శ్రీకాంత్ కు ఆఫీసు నుంచి కొన్ని కాల్స్ రావడంతో కొంతసేపు మాట్లాడారు. ఆ తర్వాత సీటు కుదురకుని కూర్చున్నారు.

ఆనంద్ : ఇంకెతకాలం ఈ-కామర్స్ రంగం హవా నడుస్తుందని అడిగారు.

శ్రీకాంత్ : ఇంకొంచెం ఆశ్చర్యపోయి, తెలీదు సార్. దానికంటే ముఖ్యమైన విషయాలు తనకు చాలా ఉన్నాయి అన్నారు. సార్.. మిమ్మల్ని చూస్తోంటే మామూలు ఉబర్ డ్రైవర్ లా కనిపించడం లేదు అని అడిగారు.

ఆనంద్ : అందుకు స్పందిస్తూ.. తాను ఐఐటీ-కే నుంచి 1986లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశానని, గత ముఫ్పై ఏళ్లుగా అమెరికా, భారత్ లలో పనిచేశానని చెప్పారు. ప్రస్తుతం కొత్తగా ఏదైనా సంస్థను ప్రారంభించాలనే ఉద్దేశంతో యాభై కార్లను ఉబర్ కింద నగరంలో నడుపుతున్నట్లు వివరించారు.

శ్రీకాంత్ : ఆ మాటలు విని అయితే, మీరు ఇప్పుడు కారు ఎందుకు నడుపుతున్నారని అడిగారు.

ఆనంద్ : కొన్ని రోజుల క్రితం తాను నడుపుతున్న కారుకు యాక్సిడెంట్ అయిందని, ఆ ప్రమాదంలో కారు డ్రైవర్ మరణించినట్లు చెప్పారు. డ్రైవర్ కుటుంబ తన నుంచి డబ్బు తీసుకోకపోవడానికి ఇష్టం చూపకపోవడంతో, తానే కారును నడపి ఆ డబ్బును వారికి పంపుతున్నట్లు వివరించారు.

ఈ సంభాషణ తన జీవితంలో ఎన్నటికీ మరచిపోలేనిదనీ.. అందుకే దానిని మిత్రులతో పంచుకున్నట్లు శ్రీకాంత్ చేసిన పోస్టులో పేర్కొన్నారు. కాగా, దాదాపు 75,000 మంది ఈ పోస్టును ఇష్టపడగా, 10,000 మందికి పైగా షేర్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement