'మెర్స్'తో మరో ఇద్దరు మృతి | South Korea MERS outbreak claims two more deaths | Sakshi
Sakshi News home page

'మెర్స్'తో మరో ఇద్దరు మృతి

Jun 26 2015 8:43 AM | Updated on Sep 3 2017 4:25 AM

'మెర్స్'తో మరో ఇద్దరు మృతి

'మెర్స్'తో మరో ఇద్దరు మృతి

దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు శుక్రవారం మరణించారు.

సియోల్ : దక్షిణ కొరియాలో మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)  వైరస్ సోకిన వారిలో మరో ఇద్దరు శుక్రవారం మరణించారు. దాంతో  మృతుల సంఖ్య 31 పెరిగింది.  ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కాగా దేశంలో మరో మెర్స్ కేసు నమోదు అయిందని పేర్కొంది. అది శామ్సంగ్ ఆస్పత్రి వైద్యునికే అని చెప్పింది. అతడికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది.

దీంతో మెర్స్ వైరస్ సోకిన వారి సంఖ్య 181కి చేరింది. ఈ వైరస్ సోకిన వారిలో 81 మంది కోలుకున్నారని... ఇంకా 69 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఈ ఏడాది మే 20వ తేదీన దక్షిణ కొరియాలో తొలి మెర్స్ వైరస్ కేసు నమోదయిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement