భారీగా తగ్గిన సోనీ ఫోన్‌ ధర.. 14వేలు కట్‌! | Sony slashes Xperia X price | Sakshi
Sakshi News home page

భారీగా తగ్గిన సోనీ ఫోన్‌ ధర.. 14వేలు కట్‌!

Feb 20 2017 11:07 AM | Updated on Nov 6 2018 5:26 PM

భారీగా తగ్గిన సోనీ ఫోన్‌ ధర.. 14వేలు కట్‌! - Sakshi

భారీగా తగ్గిన సోనీ ఫోన్‌ ధర.. 14వేలు కట్‌!

సోనీ కంపెనీ భారత వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.

సోనీ కంపెనీ భారత వినియోగదారులకు మరో బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది.  తన టాప్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్‌పిరియా ఎక్స్‌ ధరను ఏకంగా రూ. 14వేలు తగ్గించింది. దీంతో ఈ ఫోన్‌ ఇప్పుడు రూ. 24,990లకే లభిస్తోంది. ఎక్స్‌పెరియా ఎక్స్‌ ధరను మొదట 48,900గా నిర్ణయించిన సోనీ ఆ తర్వాత భారత వినియోగదారుల కోసం దీని ధరను రూ. 10వేలు తగ్గించింది. అయినా, పెద్దగా స్పందన రాకపోవడంతో ఇప్పుడు ఏకంగా రూ. 14వేలు కోత కోసింది. భారత్‌లోనే  ఇంత తక్కువ ధరకు సోనీ ఫోన్‌ లభించనుంది.

సోనీ ఎక్స్‌పెరియా ఎక్స్‌ ఫీచర్స్‌ బాగానే ఉన్నాయి. ఐదు అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 650 ప్రాసెసర్‌, 3జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ (ఎక్స్‌పాండబుల్‌ అప్‌టు 200జీబీ), 23 మెగాపిక్సెల్‌ బ్యాక్‌ కెమెరా, 13 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 2630ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ లభించనుంది. ప్రస్తుతం గ్రాఫైట్‌ బ్లాక్‌, లైమ్‌ గోల్డ్‌, రోస్‌ గోల్డ్‌, వైట్‌ కలర్‌ వేరియంట్లలో ఈ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement