జైత్రయాత్ర ముగిసింది | Sakshi
Sakshi News home page

జైత్రయాత్ర ముగిసింది

Published Tue, Jul 26 2016 9:14 AM

జైత్రయాత్ర ముగిసింది - Sakshi

అబుదాబి: ప్రపంచ పర్యటన కోసం బయల్దేరిన అతిపెద్ద సోలార్‌ విమానం ఇంపల్స్‌-2 తన జైత్రయాత్రను  విజయవంతంగా ముగిచింది. ప్రపంచ పర్యటనలో భాగంగా గత ఏడాది మార్చిలో ఆరిజోనా నుంచి ప్రారంభించిన ప్రయాణం సౌదీలోని  అబుదాబి  అంతర్జాతీయ విమానాశ్రయంలో  లాండ్ కావడంతో ముగిసింది.  అంచెలంచెలుగా తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించామని,   ఇది తమకు చాలా ప్రత్యేక క్షణమనీ  రెండవ పైలట్  ఆండ్రి బార్చ్‌బెర్గ్‌   సంతోషం వ్యక్తం చేశారు.

ఇది విమానయాన చరిత్రలోనే కాకుండా...ఇంధన చరిత్రలో కూడా  పెద్ద ఘనకార్యమని అభివర్ణించారు.  ఇంధనం అవసరం లేకుండానే దాదాపు 500 గంటల్లో 17 భాగాలుగా  40వేల కిలోమీటర్ల ప్రయాణాన్ని   పూర్తి చేసినట్టు తెలిపారు. తమ ప్రపంచ యాత్రలో ఎక్కువ కాలం ప్రయాణించిన పసిఫిక్ మహాసముద్రాన్ని దాటేటడమే తమకు  బిగ్గెస్ట్ చాలెంజ్  గా నిలిచిందంటూ తమ అనుభవాలను గుర్తు చేస్తున్నారు.

అరేబియన్ సముద్రం, భారత్, మయన్మార్, చైనా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు, అమెరికా,దక్షిణ యరోప్, నార్త్  ఆఫ్రికాలగుండా ఈ ప్రపంచయాత్ర సాగిందని తెలిపారు. ఈ విమాన రూపకర్తల్లో ఒకరైన బెర్ట్రాండ్‌ పికార్డ్‌  మరో ప్రధాన  పైలట్‌గా వ్యవహించారు. సౌర ఇంధనంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ జైత్రయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement