పంజాబ్లో టెన్షన్.. టెన్షన్ | Sikh protestors clash with police; 15 injured | Sakshi
Sakshi News home page

పంజాబ్లో టెన్షన్.. టెన్షన్

Oct 14 2015 10:53 AM | Updated on Sep 3 2017 10:57 AM

పంజాబ్లో టెన్షన్.. టెన్షన్

పంజాబ్లో టెన్షన్.. టెన్షన్

పంజాబ్లోని ఫరిద్ కోట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవదూషణలకు పాల్పడ్డారంటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది.

ఫరిద్కోట్: పంజాబ్లోని ఫరిద్ కోట్ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారటూ, దానికి వ్యతిరేకంగా కొందరు సిక్కులు నిర్వహించిన ర్యాలీ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. వీరిని అడ్డుకుని, శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు భారీ సంఖ్యలో పోలీసులు అక్కడి చేరుకోగా ఘర్షణలు మరింత మించిపోయాయి.

పరస్పర దాడులు జరగడంతో మొత్తం 17మందికిపైగా గాయాలపాలయ్యారు. వారిలో పోలీసులు కూడా ఉన్నారు. పోలీసులు లాఠీఛార్జి జరపి, భాష్పవాయుగోళాలను, జలఫిరంగులను ప్రయోగించి చివరకు రెండు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉన్నా అక్కడి వాతావరణం మాత్రం గంభీరంగా తయారైంది. ప్రజలంతా శాంతితో సంయమనం పాటించాలని ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement