శివసేన నాయకుడిపై కత్తులతో దాడి | Shiv Sena leader attacked in Thane | Sakshi
Sakshi News home page

శివసేన నాయకుడిపై కత్తులతో దాడి

Sep 12 2015 10:10 AM | Updated on Sep 3 2017 9:16 AM

మహారాష్ట్ర థానేలోని హజౌరి ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడు ధర్మేంద్ర చౌబేపై ఆగంతకులు కత్తులతో దాడి చేశారు.

థానే : మహారాష్ట్ర థానేలోని హజౌరి ప్రాంతంలో స్థానిక శివసేన నాయకుడు ధర్మేంద్ర చౌబేపై ఆగంతకులు కత్తులతో దాడి చేశారు. అనంతరం ఆగంతకులు పరారయ్యారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి వాగ్లే ఎస్టేట్స్ పోలీసులకు సమాచారం  అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ధర్మేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. స్థానిక సమస్యల కారణంగానే ధర్మేంద్రపై దాడి చేసినట్లు భావిస్తున్నామని వాగ్గే ఎస్టేట్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దిలీప్ సోలంకే తెలిపారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ దాడి శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement