లాభాల్లో మార్కెట్లు ప్రారంభం | Sensex Edges Higher, Pharma Stocks Rebound | Sakshi
Sakshi News home page

లాభాల్లో మార్కెట్లు ప్రారంభం

Dec 27 2016 9:46 AM | Updated on Sep 4 2017 11:44 PM

తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

తొమ్మిది రోజుల కరెక్షన్ అనంతరం ఫార్మా షేర్లు తిరిగి పుంజుకోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. లాభాల్లో ఎగిసిన కొద్దిసేపటికే మార్కెట్లు మళ్లీ ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. 90 పాయింట్ల లాభంలో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ ప్రస్తుతం 9.58 పాయింట్ల లాభంలో 25,816 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 7,908గా ట్రేడ్ అవుతోంది. టాటా స్టీల్, ఐటీసీ, సిప్లా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ లాభాల్లో నడుస్తుండగా.. హీరో మోటార్ కార్ప్, యాక్సిస్ బ్యాంకు, విప్రో, మహింద్రా అండ్ మహింద్రా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాలు పాలవుతున్నాయి.
 
గెయిల్ ఇండియా నిఫ్టీలో టాప్ లూజర్గా ట్రేడ్ అవుతోంది. ఈ కంపెనీ షేర్లు 1.16 శాతం పడిపోయాయి. ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 10 పైసలు పడిపోయి 67.84గా ఎంట్రీ ఇచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో అటు బంగారం ధరలు 56 రూపాయలు పెరిగి 27,050గా ట్రేడ్ అవుతున్నాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement