యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు | SC larger bench Conform Yakub Abdul Razak Memon Execution | Sakshi
Sakshi News home page

యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు

Jul 29 2015 4:14 PM | Updated on Sep 2 2018 5:43 PM

యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు - Sakshi

యాకూబ్ మెమన్ కు ఉరి ఖరారు

తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం బుధవారం కొట్టివేసింది.

న్యూఢిల్లీ: తనకు విధించిన ఉరిశిక్షపై స్టే విధించాలని 1993 ముంబై బాంబు పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్ పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అతడి ఉరిశిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. దీంతో గురువారం మహారాష్ట్ర లోని నాగపూర్ జైల్లో అతడికి ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంది.

తనకు విధించిన మరణశిక్షను అడ్డుకునేందుకు అన్ని అవకాశాలను వినియోగించుకున్నప్పటికీ మెమన్ కు ప్రాణభిక్ష దక్కలేదు. యాకూబ్ మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ తిరస్కరించారు. రాష్ట్రపతి వద్ద అతడు పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ ఇంకా పెండింగులో ఉంది. రాష్ట్రపతి కూడా దాన్ని తిరస్కరిస్తే ఇక ఉరి తీయడం ఖరారవుతుంది.

యాకూబ్ పిటిషన్ ను మంగళవారం విచారించిన జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ కురియన్ జోసెఫ్లతో కూడిన ధర్మాసనం భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. ఉరిశిక్షపై స్టే విధించేందుకు జస్టిస్ దవే నిరాకరించగా, ఉరిశిక్ష అమలును జస్టిస్ కురియన్ వ్యతిరేకించారు. దీంతో ఈ పిటిషన్ త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయింది. క్యూరేటివ్ పిటిషన్ ను తిరస్కరించడం సబబేనని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మెమన్ కు విధించిన ఉరిశిక్ష అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్ ను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement