మైక్రోసాప్ట్ సిఇఓగా తెలుగుతేజం సత్య నాదెళ్ల | Sakshi
Sakshi News home page

మైక్రోసాప్ట్ సిఇఓగా తెలుగుతేజం సత్య నాదెళ్ల

Published Tue, Feb 4 2014 8:17 PM

సత్య నాదెళ్ల

హైదరాబాద్:  మైక్రోసాప్ట్ సీఈఓ పదవి తెలుగువాడికి దక్కింది. సాప్ట్వేర్ దిగ్గజం బిల్గేట్ వారసుడిగా మైక్రోసాప్ట్ కార్పోరేషన్ కొత్త సీఈఓగా  హైదరాబాద్కు చెందిన ప్రవాస భారతీయుడు సత్య నాదెళ్ల ఎంపికయ్యారు. 78 బిలియన్ డాలర్ల టర్నోవర్తో  గ్లోబల్ జెయింట్గా ఉన్న  మైక్రోసాప్ట్ సంస్థ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గత 38 ఏళ్లలో సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మేర్ తర్వాత మూడవ సిఇఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు చేపట్టనున్నారు.  ఇటుంటి గొప్ప అవకాశం భారతీయులకు, అందులోనూ తెలుగువాళ్లకు లభించడం గర్వించదగిన విషయం.  సీఈఓ  ఎంపిక కోసం సంస్థ ఐదు నెలల పాటు  కసరత్తు చేసి సత్యను ఎంపిక చేసింది. ఈ సంస్థ సీఈఓగా స్టీవ్ బామర్  సుదీర్ఘ కాలం పని చేశారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. ఆ తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో  ఎంబీఏ పూర్తి చేశారు.  చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్లో క్లౌడ్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ విభాగానికి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.

Advertisement
Advertisement