సంగీతా చటర్జీకి 31వరకు గడువు | Sangita Chatterjee to appear in the Chittoor court is mandate | Sakshi
Sakshi News home page

సంగీతా చటర్జీకి 31వరకు గడువు

Jul 27 2016 8:18 PM | Updated on Sep 4 2017 6:35 AM

ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఎర్రచందనం అంతర్జాతీయ మహిళా స్మగ్లర్ సంగీత చటర్జీ ఈనెల 31వ తేదీలోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మూడు నెలల క్రితం చిత్తూరు పోలీసులు ఈమెను అరెస్టు చేసి కోల్‌కతా కోర్టులో హాజరుపరిచింది.

 

దీంతో.. తదుపరి విచారణకు చిత్తూరు కోర్టు నుంచి మినహాయించాలని సంగీత కోల్‌కతా కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ సంగీత చిత్తూరు కోర్టుకు హాజరయ్యేలా చూడాలని మన పోలీసులు ఇటీవల కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం కేసు విచారణకు హాజరుకాకుండా కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఈనెలాఖరులోపు చిత్తూరు న్యాయస్థానంలో హాజరుకావాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement