క్రికెటర్‌ ఖతర్నాక్‌ యాడ్‌పై దుమారం! | Sabbir Rehman add creates stir | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ ఖతర్నాక్‌ యాడ్‌పై దుమారం!

Oct 26 2016 12:09 PM | Updated on Sep 4 2017 6:23 PM

క్రికెటర్‌ ఖతర్నాక్‌ యాడ్‌పై దుమారం!

క్రికెటర్‌ ఖతర్నాక్‌ యాడ్‌పై దుమారం!

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ హీరో షబ్బీర్‌ రెహమాన్‌. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ అద్భుతంగా పోరాడాడు.

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ హీరో షబ్బీర్‌ రెహమాన్‌. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్‌ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ అద్భుతంగా పోరాడాడు. అతనికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో ఇంగ్లండ్‌ జట్టుపై చారిత్రక విజయానికి 22 పరుగుల దూరంలో బంగ్లా నిలిచిపోయింది. కానీ, షబ్బీర్‌ అసాధారణ పోరాటపటిమపై సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు వ్యక్తమైంది.

కానీ, ఇంతలోనే వెలుగులోకి వచ్చిన ఓ యాడ్‌ వీడియో మాత్రం షబ్బీర్‌ రెహెమాన్‌ను ఇరకాటంలో నెట్టేసింది. 34 ఏళ్ల బంగ్లాదేశ్‌ హాట్‌ మోడల్‌ నైలా నయీమ్‌తో కాస్తా శృతిమించి ఈ యాడ్‌లో షబ్బీర్‌ నటించాడు. నాన్‌ ఆల్కహాలిక్‌ అయిన ఆస్కార్‌ డ్రింక్‌ను ప్రమోట్‌ చేస్తూ ఈ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోలో పోలీసాఫీసర్‌గా కనిపించిన నైలా రెచ్చగొట్టేరీతిలో కనిపిస్తూ.. షబ్బీర్‌ చేతులకు బేడీలు వేయడం.. ఈ డ్రింక్‌ తాగాలంటే కొంచెం ప్రైవసీ కావాలంటూ షబ్బీర్‌ పేర్కొనడంతో.. ఇస్లామిక్‌ సంప్రదాయ దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ వీడియోపై దుమారం వ్యక్తమైంది. ఈ యాడ్‌ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ గౌరవాన్ని నిలబెట్టబోదంటూ క్రికెట్‌ బోర్డు దానిని నిషేధించింది. మరోవైపు ఈ యాడ్‌లో నటించినందుకు క్రికెటర్‌ షబ్బీర్‌ రెహమాన్‌పైనా సోషల్​ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement