Naila Nayem
-
క్రికెటర్ ఖతర్నాక్ యాడ్‌పై దుమారం!
బంగ్లాదేశ్ క్రికెట్ హీరో షబ్బీర్ రెహమాన్. ఇటీవలికాలంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ 24 ఏళ్ల యువ క్రికెటర్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోనూ అద్భుతంగా పోరాడాడు. అతనికి సహచరుల నుంచి మద్దతు లభించకపోవడంతో ఇంగ్లండ్ జట్టుపై చారిత్రక విజయానికి 22 పరుగుల దూరంలో బంగ్లా నిలిచిపోయింది. కానీ, షబ్బీర్ అసాధారణ పోరాటపటిమపై సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు వ్యక్తమైంది. కానీ, ఇంతలోనే వెలుగులోకి వచ్చిన ఓ యాడ్ వీడియో మాత్రం షబ్బీర్ రెహెమాన్‌ను ఇరకాటంలో నెట్టేసింది. 34 ఏళ్ల బంగ్లాదేశ్ హాట్ మోడల్ నైలా నయీమ్‌తో కాస్తా శృతిమించి ఈ యాడ్‌లో షబ్బీర్ నటించాడు. నాన్ ఆల్కహాలిక్ అయిన ఆస్కార్ డ్రింక్‌ను ప్రమోట్ చేస్తూ ఈ వీడియోలో కనిపించాడు. ఈ వీడియోలో పోలీసాఫీసర్‌గా కనిపించిన నైలా రెచ్చగొట్టేరీతిలో కనిపిస్తూ.. షబ్బీర్ చేతులకు బేడీలు వేయడం.. ఈ డ్రింక్ తాగాలంటే కొంచెం ప్రైవసీ కావాలంటూ షబ్బీర్ పేర్కొనడంతో.. ఇస్లామిక్ సంప్రదాయ దేశమైన బంగ్లాదేశ్‌లో ఈ వీడియోపై దుమారం వ్యక్తమైంది. ఈ యాడ్ బంగ్లాదేశ్ క్రికెట్ గౌరవాన్ని నిలబెట్టబోదంటూ క్రికెట్ బోర్డు దానిని నిషేధించింది. మరోవైపు ఈ యాడ్‌లో నటించినందుకు క్రికెటర్ షబ్బీర్ రెహమాన్పైనా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఐసిస్ వీడియోలో టాప్ మోడల్ మాజీ భర్త
ఢాకా: హోలీ బెస్ట్ బేకరిలో నరమేధం సృష్టించిన తర్వాత ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) విడుదల చేసిన వీడియోలో బంగ్లాదేశ్ టాప్మోడల్ నైలా నయెమ్ మాజీ భర్త తుషార్ ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఢాకాలో దాడికి పాల్పడిన ఐసిస్ ఉగ్రవాదులను ప్రశంసిస్తూ ముగ్గురు వ్యక్తులు బంగ్లా భాషలో మాట్లాడిన వీడియోను మంగళవారం ఇంటర్నెట్లో పెట్టారు. మరిన్ని దాడులకు పాల్పడుతామని ఈ వీడియోలో హెచ్చరించారు. బాగా పెరిగిన గడ్డంతో తుషార్ ఈ వీడియోలో కనిపించాడు. దంత వైద్యుడైన అతడు గత రెండేళ్ల నుంచి కనిపించకుండా పోయాడు. అతడి తండ్రి వషీకుర్ ఆజాద్ బంగ్లాదేశ్ ఆర్మీలో మేజర్‌గా పనిచేశారు. ఢాకాలోని బరిదర డిఫెన్స్ ఆఫీర్స్ హౌసింగ్ కాలనీలో నివసించిన తుషార్ 2011లో నైలా నయెమ్ను పెళ్లాడు. తర్వాత వారిద్దరూ విడిపోయారు. వీడియోలో కనిపించిన మరో వ్యక్తిని ఢాకా వర్సిటీ విద్యార్థి త్వాసిఫ్ హుస్సేన్ గా గుర్తించారు. జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్(జేఎంబీ)తో సంబంధాలున్నాయనే ఆరోపణతో గతంలో అతడిని అరెస్ట్ చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత అతడిని తల్లిదండ్రులు ఆస్ట్రియాకు పంపించారు. మూడో వ్యక్తిని తమీమ్ రహ్మాన్ షఫీగా గుర్తించారు. ఈ వీడియోను సిరియా రాజధాని అల్-రఖాలో రికార్డు చేసినట్టు ఐసిస్ వెల్లడించింది.


