నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు | RTC buses stopped in effect of ap bandh | Sakshi
Sakshi News home page

నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు

Aug 29 2015 7:26 AM | Updated on Aug 18 2018 4:18 PM

నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు - Sakshi

నెల్లూరులో నిలిచిపోయిన బస్సులు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి.

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ సీపీ చేపట్టిన బంద్ కారణంగా జిల్లా వ్యాప్తంగా బస్సులు డిపోల్లోనే నిలిచిపోయాయి. శనివారం తెల్లవారుజామున 4గంటలకే వైఎస్సార్ సీపీ జిల్లాలోని పలు డిపోలకు వద్దకు చేరుకొని బస్సులను నిలిపి వేశారు. ఈ సందర్భంగా డిపోల ఎదట బైఠాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement