సినీనటి బంధువు అరెస్ట్‌ | Rs 7 crore worth banned currency notes seized | Sakshi
Sakshi News home page

సినీనటి బంధువు అరెస్ట్‌

Jun 22 2017 1:49 PM | Updated on Sep 5 2017 2:14 PM

సినీనటి బంధువు అరెస్ట్‌

సినీనటి బంధువు అరెస్ట్‌

రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది.

హైదరాబాద్‌: రద్దైన పెద్దనోట్ల మార్పిడి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా నగరంలోని జూబ్లిహిల్స్‌లో పెద్ద ఎత్తున పాత కరెన్సీ నోట్లు పట్టుబడ్డాయి. పెద్ద మొత్తంలో నోట్ల మార్పిడి జరుగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 కోట్ల రద్దైన పాతనోట్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు సినీనటి జీవితా రాజశేఖర్‌కు సమీప బంధువుగా తెలుస్తోంది.

జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శ్రీనివాస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ పేరుతో కంపెనీ నడుపుతున్న శ్రీనివాస్‌తో పాటు రవి అనే మరో వ్యక్తిని సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ అంశంలో జీవిత ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌తో గతంలోనూ ఒకసారి అరెస్టైనట్టు తెలుస్తోంది. డ్రగ్స్‌ తీసుకుంటూ ఒకసారి అతడు పోలీసులకు చిక్కాడు.

Advertisement
 
Advertisement
Advertisement