అధికార లాంఛనాలతో ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు | RK Laxman accorded state funeral; Maha govt to set up memorial | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు

Jan 27 2015 4:41 PM | Updated on Sep 2 2017 8:21 PM

అధికార లాంఛనాలతో ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు

అధికార లాంఛనాలతో ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు

ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పుణేలోని వైకుంఠ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో ముగిశాయి.

పుణే: ప్రఖ్యాత కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం పుణేలోని వైకుంఠ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన కుమారుడు శ్రీనివాస్ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అశ్రునయనాలతో అభిమానులు ఆర్కే లక్ష్మణ్ కు అంతిమ వీడ్కోలు పలికారు.

అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవంద్ర ఫడణవీస్, విద్యాశాఖ మంత్రి వినోద్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఎమ్మెన్నెస్ అధినేత రాజ్ థాకరే తదితర ప్రముఖులు ఆర్కే లక్ష్మణ్ భౌతిక కాయాన్ని సందర్శించి, శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా నివాళి అర్పించారు. ఆర్కే లక్ష్మణ్ స్మారక స్థూపం నిర్మిస్తామని ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement