'రూ. 2 కోట్ల పైలాన్‌కు 36 పగుళ్లు' | revanth reddy comment on water grid project | Sakshi
Sakshi News home page

'రూ. 2 కోట్ల పైలాన్‌కు 36 పగుళ్లు'

Oct 14 2015 1:34 PM | Updated on Aug 10 2018 8:16 PM

'రూ. 2 కోట్ల పైలాన్‌కు 36 పగుళ్లు' - Sakshi

'రూ. 2 కోట్ల పైలాన్‌కు 36 పగుళ్లు'

నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో రూ.2 కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్మించిన వాటర్‌గ్రిడ్ పథకం పైలాన్‌కు మూడు నెలల్లోనే 36 పగుళ్లిచ్చాయని,

చౌటుప్పల్:  నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలంలో రూ.2 కోట్లు పెట్టి ప్రభుత్వం నిర్మించిన వాటర్‌గ్రిడ్ పథకం పైలాన్‌కు మూడు నెలల్లోనే 36 పగుళ్లిచ్చాయని, ఇక రూ.40 వేల కోట్లతో చేపట్టిన ఆ పథకం తీరు ఎలా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన చౌటుప్పల్‌లో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం వాటర్‌గ్రిడ్ పథకం పైలాన్‌ను సందర్శించారు.

అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తల్లీ బిడ్డల పాలనలో అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే నేటికీ కనిపిస్తోందన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే దొంగ నోట్ల కేసులో, మరో ఎమ్మెల్యే ఇసుక దందాలో ఇరుక్కున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement