పచ్చి గుడ్లు, ఒంటరి జీవితమే తన దీర్ఘాయువు రహస్యమని చెబుతోంది 115 ఏళ్ల ఎమ్మా మోరానో.
న్యూయార్క్: పచ్చి గుడ్లు, ఒంటరి జీవితమే తన దీర్ఘాయువు రహస్యమని చెబుతోంది 115 ఏళ్ల ఎమ్మా మోరానో. ఈ శతాధిక వృద్దురాలు యూరోప్‌లోనే అత్యంత పెద్ద వయస్కురాలు. అంతే గాకుండా ప్రపంచంలోనే అధిక వయసున్న వారి జాబి తాలో ఐదో స్థానంలో ఉంది.
తాను యుక్త వయసులో ఉండగా గుడ్డు తాగితే ఎనీమియా తగ్గుతుందని ఓ డాక్టర్ చెప్పడంతో, అప్పటి నుంచి రోజుకు మూడు గుడ్లు తాగుతున్నానని మోరానో చెప్పింది. 1938లో వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి ఒం టరిగానే ఉంటుంది. అయితే ఒంట రిగా ఉండటం కూడా దీర్ఘాయువుకు కారణమంటోంది.వెర్బానియాలో ఉం టున్న మోరానో ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని డాక్టర్ చెప్పారు.