బీజేపీని కోర్టుకు లాగిన రాంజెఠ్మాలనీ | Ram Jethmalani sues BJP over expulsion, spares Narendra Modi, Vajpayee | Sakshi
Sakshi News home page

బీజేపీని కోర్టుకు లాగిన రాంజెఠ్మాలనీ

Oct 21 2013 2:24 PM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీని కోర్టుకు లాగిన రాంజెఠ్మాలనీ - Sakshi

బీజేపీని కోర్టుకు లాగిన రాంజెఠ్మాలనీ

ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ... భారతీయ జనతా పార్టీని కోర్టుకు లాగారు.

న్యూఢిల్లీ : ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ... భారతీయ జనతా పార్టీని కోర్టుకు లాగారు. తనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడాన్ని తప్పుబడుతూ  ఆయన ఢిల్లీ హైకోర్టులో సోమవారం పిటిషన్‌ దాఖలు చేశారు.  తనను అప్రతిష్టపాలు చేసేందుకే సస్పెండ్‌ చేశారని దీనికి నష్టపరిహారం చెల్లించాలని రాంజెఠ్మాలనీ పార్టీని డిమాండ్‌ చేశారు.

పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ప్రతీ ఒక్కరూ 50 లక్షలు తనకు పరిహారంగా చెల్లించాలని  డిమాండ్‌ చేశారు. ఈ పిటిషన్‌ నుంచి మాజీ ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పేర్లను మినహాయించారు. బీజేపీ అధ్యక్షుడు  నితిన్‌ గడ్కరీనిని పదవి నుంచి దిగిపోవాలని జెఠ్మాలనీ డిమాండ్‌ చేయడంతో... బీజేపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement