టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు | Ralph Speth, N. Chandrasekaran join Tata Sons Board | Sakshi
Sakshi News home page

టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు

Oct 25 2016 8:31 PM | Updated on Sep 4 2017 6:17 PM

టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు

టాటా సన్స్ బోర్డులో కొత్త సభ్యులు

టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం ఆ గ్రూపు తీసుకుంది.

టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ పల్లోంజి మిస్త్రీని తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత మరో నిర్ణయం ఆ గ్రూపు తీసుకుంది. చైర్మన్ పదవి రేసులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. చంద్రశేఖరన్నూ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సీఈవో డాక్టర్. రాల్ఫ్ స్పెత్ను టాటా సన్స్ డైరెక్టర్ బోర్డులో అదనపు డైరెక్టర్లుగా నియమించింది.

వీరి చేరికపై స్పందించిన టాటా సన్స్ తాత్కాలిక చైర్మన్ రతన్ టాటా, వారి వారి కంపెనీల్లో శ్రేష్టమైన నాయకత్వపు గుర్తింపుగా వీరి నియామకం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఇద్దరి ఎంపికతో, తొమ్మిది సభ్యులున్న టాటా సన్స్ బోర్డు సభ్యులు, పదకొండు మందికి పెరిగారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా ఉన్న వారినే చైర్మన్లుగా నియమించే అవకాశముంటుంది కనుక ముందస్తుగా రేసులో ఉన్న వారిని టాటా సన్స్ అదనపు బోర్డు డైరెక్టర్లుగా నియమించుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement