అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్! | Rajinikanth watches Kabali with fans in US, gets standing ovation | Sakshi
Sakshi News home page

అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!

Jul 21 2016 7:27 PM | Updated on Sep 4 2017 5:41 AM

అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!

అమెరికాలో రజనీకి స్టాండింగ్ ఒవేషన్!

అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు.

అమెరికాలో బుధవారం సాయంత్రం రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను స్పెషల్ స్ర్కీనింగ్ ఏర్పాటుచేశారు. ఈ షోకు హాజరైన అభిమానులు ఊహించని అతిథిని చూసి ఆశ్చర్యపోయారు. ‘కబాలి’ సినిమాకు వచ్చిన అభిమానులకు ఏకంగా రియల్ ‘కబాలి’ రజనీకాంత్ దర్శనమివ్వడంతో సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయారు.

సాన్‌ ఫ్రాన్సిస్కోలో ఏర్పాటు చేసిన ఈ షోకు రజనీ ప్రత్యేక అతిథిగా హాజరై.. అభిమానుల్ని అలరించారు. భారత్‌లోనే కాదు అమెరికాలోనూ ‘కబాలి’ సినిమా తొలి మూడు రోజుల టికెట్లు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెరికా నుంచి ప్రస్తుతం ‘‍కబాలి’ సినిమా సానుకూల స్పందన వ్యక్తమవుతున్నది. ‘కబాలి’ని చూసిన చాలామంది అమెరికన్ ఇండియన్లు అభిమానులకు ఈ సినిమా పండుగేనని అంటున్నారు.


‘కబాలి తలైవా అభిమానులకు పైసా వసూల్ సినిమా. అభిమానులు మెస్మరైజ్ అయ్యే సీన్లు ఎన్నో ఉన్నాయి. పలుసార్లు థియేటర్‌ హర్షధ్వానాలతో దద్దరిల్లింది’ అని ఇండస్ట్రి ఇన్‌సైడర్ రమేశ్ అమెరికాలో వస్తున్న రెస్పాన్స్‌ మీద స్పందిస్తూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement