ధ్రువపై డైరెక్టర్‌ రాజమౌళి కామెంట్‌! | rajamouli comments on Dhruva | Sakshi
Sakshi News home page

ధ్రువపై డైరెక్టర్‌ రాజమౌళి కామెంట్‌!

Dec 11 2016 7:41 PM | Updated on Jul 23 2019 11:50 AM

ధ్రువపై డైరెక్టర్‌ రాజమౌళి కామెంట్‌! - Sakshi

ధ్రువపై డైరెక్టర్‌ రాజమౌళి కామెంట్‌!

మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తాజా సినిమా ధ్రువ.

మెగాపవర్‌ స్టార్‌ రాంచరణ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తాజా సినిమా ధ్రువ. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై స్టార్‌ డైరెక్టర్‌ రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించాడు. ఇమేజ్‌ కన్నా కథకు అధిక ప్రాధాన్యమివ్వడం వల్ల ధ్రువ సినిమా ఆసక్తికరంగా, కట్టిపడేసేలా ఉందని, అందుకు చరణ్‌ను, డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డిని ఎంతగానో అభినందిస్తున్నానని రాజమౌళి ట్వీట్‌ చేశాడు.

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతమైన ఫిజిక్‌తో చరణ్‌ గొప్పగా కనిపించాడని, సినిమా మొత్తం చక్కని ఎక్స్‌ప్రెషన్స్‌ చూపించాడని, రకుల్‌ కూడా చక్కగా నటించిందని కితాబిచ్చారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్‌ వెర్షన్‌లో తానేంటో రుజువు చేసుకున్న అరవింద్‌ స్వామి తెలుగులోనూ అద్భుతంగా నటించాడని, ఈ సినిమాకుగాను రైటర్‌కు ఫుల్‌ మార్కులు ఇవ్వొచ్చునని, అతనే నిజమైన హీరో అని కొనియాడారు.

Advertisement
 
Advertisement
Advertisement