నిరాశపర్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ | Sakshi
Sakshi News home page

నిరాశపర్చిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌

Published Tue, Feb 7 2017 12:38 PM

Punjab National Bank reports net profit of Rs 207 crore in December quarter against estimates of Rs 555 crore

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌  దిగ్గజం పంజాబ్‌  నేషనల్‌ బ్యాంక్‌ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది.  డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 లో  నికర లాభాలు పుంజుకుని రూ.207 కోట్లను నమోదు చేసింది.  అయితే ఈ త్రైమాసికంలో పీఎన్‌బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేశాయి. గత ఏడాదితో పోలిస్తే 306శాతం పెరుగుదలను నమోదు చేసినపప్పటికీ  ఈ త్రైమాసికంలో పీఎన్‌బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేశాయి.  మొత్తం ఆదాయం రూ. 14, 498కోట్లను సాధించింది. గత ఏడాది ఇది రూ. 13891కోట్లుగా ఉంది.

డీమానిటైజేషన్ కాలంలో తమకు టఫ్‌టైం అని బ్యాంక్‌ తెలపింది.అయితే సిబ్బంది ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా అధిగమించారని  చెప్పింది.

క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం రూ.51 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పుంజుకున్నాయి. ఇందుకు బకాయిలు(స్లిప్పేజెస్‌) తగ్గడం కారణమైనట్లు బ్యాంక్‌  తెలిపింది.   ఈ క్వార్టర్‌లో ఫ్రెష్‌ స్లిప్పేజెస్‌ రూ. 5089 కోట్ల నుంచి రూ. 4800 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది.  కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 4119 కోట్ల నుంచి రూ. 3731 కోట్లకు క్షీణించింది. ప్రొవిజన్లు రూ. 3,775 కోట్ల నుంచి తగ్గి రూ. 2,936 కోట్లకు పరమితమయ్యాయి. ఇక త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 13.63 శాతం నుంచి 13.7 శాతానికి నామమాత్రంగా పెరిగితే.. నికర ఎన్‌పీఏలు 9.1 శాతం నుంచి 9.09 శాతానికి స్వల్పంగా మెరుగయ్యాయి.


 

Advertisement
Advertisement