బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి | Psycho attacks on boy at Baptla | Sakshi
Sakshi News home page

బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి

Oct 3 2015 11:19 AM | Updated on Sep 3 2017 10:23 AM

బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి

బాపట్లలో సూది సైకో వీరంగం.. విద్యార్థిపై దాడి

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు శనివారం గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమైయ్యాడు.

గుంటూరు: రాష్ట్రవ్యాప్తంగా పలుజిల్లాల్లో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సైకో సూదిగాడు శనివారం గుంటూరు జిల్లాలో ప్రత్యక్షమైయ్యాడు. బాపట్లలో ఓ విద్యార్థిపై ఇంజక్షన్తో దాడి చేశాడు. శనివారం ఉదయం కృష్ణ అనే విద్యార్థి స్కూల్‌కి వెళ్తున్న సమయంలో... బైక్‌పై వచ్చిన ఆగంతకుడు అతడికి ఇంజక్షన్‌ గుచ్చి పరారైనట్టు తెలిసింది.

బాధితుడు కృష్ణను స్థానికులు ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. సైకో సూదిగాడి దాడులతో మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ఘటనతో బాపట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement