ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి

ముంబై పోలీసు కమిషనర్ ను కలిసిన ప్రీతి


ముంబై: మాజీ ప్రియుడు నెస్ వాడియాపై పెట్టిన వేధింపుల కేసు పెట్టిన బాలీవుడ్ నటి ప్రీతిజింటా సోమవారం ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియాను కలిశారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు. కమిషనర్ వెంటనే ఆమెకు అనుమతియిచ్చారు. ఈ సందర్భంగా వేధింపుల కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు కమిషనర్ కు తెలిపారు. ఈ కేసులో ముంబై వాంఖడే క్రికెట్ స్టేడియంలో పోలీసులకు సుమారు గంటన్నరపాటు ఇటీవల వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే.మే 30న ఈ స్టేడియంలో ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా కింగ్స్-11 పంజాబ్ (ప్రీతి, వాడియా ఈ జట్టు సహ యజమానులు), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాడియా తనను వేధించినట్లు, తన గౌరవానికి భంగం కలిగించినట్లు ప్రీతిజింటా ఈ నెల 12న పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top