కలెక్టర్‌ బంఫర్ ఆఫర్‌.. కానుకగా ‘కబాలి’ టికెట్లు! | pondicherry Collector offers kabaali tickets | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ బంఫర్ ఆఫర్‌.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!

Jun 30 2016 8:32 PM | Updated on Sep 4 2017 3:49 AM

కలెక్టర్‌ బంఫర్ ఆఫర్‌.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!

కలెక్టర్‌ బంఫర్ ఆఫర్‌.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అభిమానగణం గురించే అందరికీ తెలిసిందే.

సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అభిమానగణం గురించే అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అభిమానులు పడి చస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి కలెక్టర్‌ తాజాగా అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛభారత్‌ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికి రజనీ తాజా సినిమా ‘కబాలి’ టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించారు.

ఊహించినట్టే ఈ ప్రకటనకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌ కిరణ్‌ బేడి ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకి కిరణ్‌ బేడి ఓ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ఆయన ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement