మహిళల పట్ల అసభ్య ప్రవర్తన: ఏఎస్ఐపై కేసు | Police officer booked for misbehaving with woman | Sakshi
Sakshi News home page

మహిళల పట్ల అసభ్య ప్రవర్తన: ఏఎస్ఐపై కేసు

Nov 28 2014 7:33 PM | Updated on Aug 21 2018 6:21 PM

ఓ కేసు విషయమై పోలీసు స్టేషన్కు వచ్చిన మహిళల నుంచి లంచం అడగడమే కాక, ఇవ్వడానికి నిరాకరించినందుకు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐపై కేసు నమోదైంది.

ఓ కేసు విషయమై పోలీసు స్టేషన్కు వచ్చిన మహిళల నుంచి లంచం డిమాండ్ చేయడమే కాక, ఇవ్వడానికి నిరాకరించినందుకు వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏఎస్ఐపై కేసు నమోదైంది. నరేంద్ర కుమార్ సెక్టార్-5 పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు. మీనూసింగ్ అనే మహిళను లంచం అడిగి, ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తమ ప్రాంతంలో అద్దెకు ఉంటున్నవారితో సమస్య రావడంతో మరికొందరితో కలిసి ఆమె స్టేషన్కు వెళ్లారు.

ఏఎస్ఐ నరేంద్రకుమార్ తమను అవమానించి, అసభ్యంగా ప్రవర్తించారని ఆమె పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు కమిషనర్ నవదీప్ సింగ్ విర్క్ స్పందించి, ఏఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈ సంఘటనకు చాలామంది ప్రత్యక్ష సాక్షులు ఉండటంతో కేసు పెట్టినట్లు ఏసీపీ రాజేష్ కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement