అమెరికాలో మళ్లీ కాల్పుల మోత! | Police officer, 3 others killed in Wisconsin shootings | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ కాల్పుల మోత!

Mar 23 2017 10:04 AM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలోని విస్కాన్సిన్‌లో మళ్లీ కాల్పులు మోత మోగింది.

అమెరికాలోని విస్కాన్సిన్‌లో మళ్లీ కాల్పులు మోత మోగింది. ఉత్తర విస్కాన్సిన్‌లో బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి యథేచ్ఛగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీసు అధికారితోపాటు మరో ముగ్గురు ప్రాణాలు విడిచారు. ఓ బ్యాంకులో జరిగిన కుటుంబ వివాదం కారణంగా నిందితుడు కాల్పులకు పాల్పడినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, ప్రజలకు ఎలాంటి ముప్పు లేదని ఎవరెస్ట్‌ మెట్రో పోలీసు చీఫ్‌ వ్యాలీ స్పార్క్స్‌ వెల్లడించారు. నిందితుడి గురించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో విస్కాన్సిన్‌లోని ఓ బ్యాంకులో, ఓ న్యాయసేవల సంస్థలో, అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తీవ్ర ఎదురుకాల్పుల అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement