జపాన్ లో మొదలైన ఆ సునామీ | Pokemon Go finally launches in Japan | Sakshi
Sakshi News home page

జపాన్ లో మొదలైన ఆ సునామీ

Jul 22 2016 11:04 AM | Updated on Sep 4 2017 5:51 AM

జపాన్ లో మొదలైన ఆ  సునామీ

జపాన్ లో మొదలైన ఆ సునామీ

ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి నాంది పలికిన క్రేజీ గేమ్ పోకిమాన్ గో ఎట్టకేలకు జపాన్ లో లాంచ్అయింది.

టోక్యో: ప్రపంచవ్యాప్తంగా సంచలనానికి నాంది పలికిన  క్రేజీ గేమ్ పోకిమాన్ గో  ఎట్టకేలకు జపాన్ లో లాంచ్ అయింది.  ఈ గేమ్ ను రూపొందించిన జపాన్ కు చెందిన  సాఫ్ట్ వేర్ కంపెనీ నియాంటిక్ ల్యాబ్స్ స్వయంగా ప్రకటించింది. దీంతో    పోకిమాన్ అభిమానులు సంతోషంలో మునిగి తేలుతున్నారు.  పోకీమాన్ గో యూజర్లు   ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ గేమ్ పై  నిపుణుల హెచ్చరికలు,  ప్రమాదాల నేపథ్యంలో  జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు  అక్కడి అధికారులు  సందేశాలు జారీ చేశారు.    హెచ్చరికలకు కట్టుబడి ఉండి...ప్రజలు తమ తమ స్మార్ట్ ఫోన్లలో గేమ్ ను సురక్షితంగా ఆడుకోవాలని చీఫ్ కేబినెట్ కార్యదర్శి యోషిండే  సుగా  ట్వీట్ చేశారు. దీంతో  ఇది 15 వేల సార్లు రీట్విట్ అయింది.

కాగా  ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ గేమ్‌ ..అమెరికా, న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో జూలై ఆరున అధికారికంగా లాంచ్ అయ్యాయి.  కెనడాలో  జూలై 17న ఈ  గేమ్ హవా  మొదలైంది.  అయితే మిగిలిన చాలా దేశాల్లో అఫీషియల్ లాంచింగ్ ముగియనప్పటికీ అనధికారంగా లక్షలమంది  యూజర్లతో పోకిమాన్ గేమ్  మానియా కొనసాగుతోంది.  గూగుల్  సెర్చ్ లో పోర్న్‌ సైట్లు, బ్రెక్సిట్‌ ను సైతం దాటేసిన  పోకెమాన్‌ గో దూసుకుపోతోంది. అటు ఈ గేమ్ ప్రభావంపై స్పందించిన  ఇండోనేషియా ప్రభుత్వం  కొన్ని ఆంక్షలు విధించగా,సౌదీమత పెద్దలు ఆటలు నిషేధిస్తూ ఫత్వాజారీ చేయడం విశేషం.

మరోవైపు  పోకిమాన్ ఆవిష్కరణతో రికార్డ్  స్థాయిలాభాలను ఆర్జించిన నింటెండో షేర్లు తమ హవాను కొనసాగిస్తున్నాయి.   లాంచింగ్ తరువాతజపాన్ మార్కెట్లో  సుమారు 5 శాతానికి పైగా లాభపడ్డాయి.  ప్రముఖ ఫుడ్ చైన్  మెక్  డోనాల్డ్  స్పాన్సర్ షిప్  డీల్ కుదుర్చుకోవడంతో నష్టాల్లో ఉన్న మెక్ డోనాల్డ్  ఊపిరి పీల్చుకుంటున్న   సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement