
తన సోయితప్పి పడుకోవడంతో!
లైబ్రెరీకి వెళితే.. ఎవరైనా బుద్ధిగా చదువుకుంటారు.
లైబ్రెరీకి వెళితే.. ఎవరైనా బుద్ధిగా చదువుకుంటారు. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది, చదువుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి చాలామంది లైబ్రెరీకి వెళ్లి పరీక్షలకో, కాంపిటేషన్‌కో ప్రిపేర్ అవుతుంటారు. కానీ, ఓ అమ్మాయి మాత్రం గ్రంథాలయానికి వెళ్లి కునుకుతీసింది. అలా-ఇలా కాదు. లోకం మరిచిపోయి గాఢ నిద్రలో మునిగిపోయింది. లైబ్రెరీ సోఫాలో ఒకింత విచిత్రమైన భంగిమతో సోయితప్పి నిద్రలోకి జారుకున్న ఆమె ఫొటో ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. ఇంకేముంది కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఆ ఫొటోతో కొందరు నెటిజన్లు ఆట ఆడుకున్నారు.
ఫొటోషాప్ బ్యాటల్‌తో తమ క్రియేటివిటీని అంతా ఆమె ఫొటోపై చూపారు. చూడటానికి ఒకింత చిత్రంగా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటున్న ఆ ఫొటోలివి. గేమ్స్ ఆఫ్ థ్రోన్స్ నుంచి ఒలింపిక్స్ వరకు అన్నీ ఈవెంట్లలోకి ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి.. ఇలా వింత ఫొటోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ‘రెడిట్’లో కనిపించి హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలపై ఓసారి లుక్కేయండి!
ఇనుపముళ్ల మధ్య కూడా ఎంత శాంతంగా నిద్రోపోతున్నదో!
అరె.. మైకేల్ జాక్సన్‌కే మతిపోయే భంగిమ!
ర్యాపర్ డ్రాకె కూడా పోటీపడలేకపోతున్నాడు!
నిద్రలోనూ రేసులో దూసుకుపోతోంది.. ఉసేన్ బోల్టు కూడా ఉలికిపడతాడేమో!
ఊహాల్లో తేలిపోతే.. సోఫానే ఎంత అందమైన సముద్రతీరమవుతుందో మీరే చూడండి
హా..! ఎంత రెజ్లింగ్ ఫైటరైనా ఇలా మీద పడితే తట్టుకోగలడా?
కోతులకు తగ్గ కోతి దొరికిందట! హాహాహా..
మన నిద్రరారాణి ఈ పెయింటింగ్‌లో ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం!
పింక్ సోఫాలో కన్నా.. ఇలా బేటర్ గా నిద్రపోవచ్చేమో!