తగ్గనున్న పెట్రోల్ ధర! | Petrol price will be decrease! | Sakshi
Sakshi News home page

తగ్గనున్న పెట్రోల్ ధర!

Aug 12 2014 6:38 PM | Updated on Jul 12 2019 4:35 PM

తగ్గనున్న పెట్రోల్ ధర! - Sakshi

తగ్గనున్న పెట్రోల్ ధర!

పెట్రోల్‌ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఈసారి ఏకంగా లీటరుకు రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్‌ రంగ విశ్లేషకులు అంచనా.

హైదరాబాద్: పెట్రోల్‌ ధర మరోసారి తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు 1న రూపాయి 9 పైసలు తగ్గిన లీటర్‌ పెట్రోల్‌ ధర ఈసారి ఏకంగా రెండున్నర రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని ఆయిల్‌ రంగ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు కూడా దిగిపోయి 104 డాలర్లకు సమీపంలోకి వచ్చింది. ఈ కారణంగా ఆయిల్‌ కంపెనీలకు పెట్రోల్‌ మీద ఇప్పుడు లాభాలు వస్తున్నాయి. ఈ లాభాల్ని  చాలా వరకు వినియోగదారులకే అందించాలని ఆయిల్‌ కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పెట్రోల్‌ ధరను భారీగా తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం. పైగా అదే రోజు ఎర్రకోట నుంచి ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని కీలక ప్రకటనలు చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఆ నేపథ్యంలో ఆయిల్‌ కంపెనీలు కూడా తమ వంతుగా పెట్రోల్‌ ధరను రెండున్నర రూపాయలు  తగ్గించే అవకాశం ఉంది. నిజానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 పైసలు పతమమైంది. అలా కాకుండా ఉంటే పెట్రోల్‌ ధర 3 రూపాయలు దాకా తగ్గేదని  చమురు కంపెనీల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement