బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు! | Pensioners get money in 2-rupee coins | Sakshi
Sakshi News home page

బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు!

Dec 3 2016 9:50 AM | Updated on Sep 27 2018 9:08 PM

బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు! - Sakshi

బ్యాంకుకు వెళితే చిల్లర చేతిలో పెట్టారు!

పంజాబ్‌లోని జలంధర్‌లో పెన్షనర్లకు వింత అనుభవం ఎదురైంది.

జలంధర్‌: ప్రజలకు కరెన్సీ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 10 వేల రూపాయలు చొప్పున నగదు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా చాలా బ్యాంకుల్లో కేవలం 2 వేల రూపాయలు మాత్రమే ఇచ్చారు. పంజాబ్‌లోని జలంధర్‌లో పెన్షనర్లకు వింత అనుభవం ఎదురైంది.

బ్యాంకుల్లో పెన్షనర్లకు 10 వేల రూపాయల నగదు అయితే ఇచ్చారు కానీ 9 వేల రూపాయలకు మాత్రమే నోట‍్లను అందజేశారు. మిగిలిన 1000 రూపాయలకు రెండు రూపాయల నాణేలు ఇచ్చారు. ఓ కవర్‌లో ఉంచిన చిల్లరను బ్యాంకర్లు పెన్షనర్ల చేతిలో పెట్టారు. దీంతో వారు అవాక్కయ్యారు. ఈ రెండు రూపాయల నాణేలతో ఏం చేయాలి? ఎలా ఉపయోగపడుతుంది? అంటూ ఓ పెన్షనర్‌ ప్రశ్నించారు. ఈ రోజుల్లో పిల్లలు కూడా 2 రూపాయల నాణేలను తీసుకోవడం లేదు.. ఇవి ఎలా ఉపయోగపడతాయి? ప్రభుత్వం మమ్మల్ని ఆ స్థాయికి దిగజార్చిందంటూ వాపోయారు. దీనిపై బ్యాంకు అధికారులు వివరణ ఇస్తూ.. నగదు సమస్య అని కొందరు చెప్పగా, కంప్యూటర్ల సమస్య అని మరికొందరు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement