ఎన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల నిందితుడు పరారీ | Patna terror suspect escaped from NIA custody | Sakshi
Sakshi News home page

ఎన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల నిందితుడు పరారీ

Oct 31 2013 5:06 PM | Updated on Sep 2 2017 12:10 AM

ఎన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల నిందితుడు పరారీ

ఎన్ఐఏ కస్టడీ నుంచి పాట్నా పేలుళ్ల నిందితుడు పరారీ

పాట్నా వరుస పేలుళ్లలో అనుమానితుడు మెహ్రార్ ఆలాం పోలీసుల కస్టడిని నుంచి గురువారం తప్పించుకున్నారు.

పాట్నా వరుస పేలుళ్లలో అనుమానితుడు మెహ్రార్ ఆలాం పోలీసుల కస్టడిని నుంచి గురువారం తప్పించుకున్నారు. పాట్నాకు 70 కిలో మీటర్ల దూరంలోని ముజఫర్ పూర్ లో ఆలాంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ప్రశ్నించారు. ఎన్ఐఏ కస్టడీ నుంచి ఆలాం తప్పించుకోవడం అనేక విమర్శలకు తావిస్తోంది. 
 
పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకున్న తర్వాత ఆలాంపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న ఆలాం పేలుళ్లకు పాల్పడిన ఆరుగురు సభ్యులో ఒకరైన తెహసీన్ అక్తర్ కు అత్యంత సన్నిహితుడు. ఇప్పటి వరకు అక్తర్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తీరుగుతున్నాడు. 
 
గత అదివారం పాట్నాలోని గాంధీ మైదానంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పాల్గొన్న హుంకార్ ర్యాలీలో వరుస పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement