'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు' | palvai govardhan reddy complaint to sonia gandhi on telangana CLP | Sakshi
Sakshi News home page

'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు'

Apr 30 2015 8:16 PM | Updated on Sep 3 2017 1:10 AM

'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు'

'ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నా పట్టించుకోవడం లేదు'

తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు.

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... నాడు పి. జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 26 మంది ఎమ్మెల్యేలున్నా చంద్రబాబు ప్రభుత్వంపై సమర్థవంతంగా పోరాడామని గుర్తు చేశారు. నేడు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లిపోతున్నా సీఎల్పీ పట్టించుకోవడం లేదని పాల్వాయి వాపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement