టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!

Three More Congress MLAs Soon Join In TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం అయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే. వీరిలో ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. ఈ ముగ్గురు టీఆర్‌ఎస్‌లో చేరితే.. మొత్తం 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరినట్టు అవుతుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది.

13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు టీఆర్‌ఎస్‌ మంతనాలు జరుపుతోంది. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా వీరు స్పీకర్‌ కార్యాలయాన్ని కోరనున్నారు. జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈలోపే విలీన పక్రియ పూర్తి చేయాలని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top