సీఎం వెంట చిన్నమ్మ తనయుడు.. | Palanisamy and VKSasikala nephew Dhinakaran pay tribute Jayalalithaa | Sakshi
Sakshi News home page

సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..

Feb 16 2017 7:08 PM | Updated on Sep 5 2017 3:53 AM

సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..

సీఎం వెంట చిన్నమ్మ తనయుడు..

తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన అనంతరం ఎడపాడి కె.పళనిస్వామి తన మంత్రులతో కలిసి..

పళని, మంత్రుల వెంట వెళ్లి..
జయలలిత సమాధి వద్ద నివాళులు..


తమిళనాడు 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించిన అనంతరం ఎడపాడి కె.పళనిస్వామి తన మంత్రులతో కలిసి నేరుగా మేరినా బీచ్‌లోని దివంగత సీఎం జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రుల వెంట వచ్చిన వీకే శశికళ అక్క కొడుకు టీవీవీ దినకరన్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం వెంట ముందువరుసలో నిలుచొని దినకరన్ నివాళులర్పించారు.

ఆదాయానికి మించి ఆస్తుల కేసుల్లో తనకు జైలు శిక్ష పడటంతో శశికళ తన అక్క కొడుకు దినకరన్‌ను డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన సంగతి తెలిసిందే. శశికళ జైలులో ఉన్న నేపథ్యంలో పార్టీని తన కనుసన్నలలో ఉంచుకునేందుకు ఈ నియామకం చేపట్టినట్టు భావిస్తున్న నేపథ్యంలో దినకరన్ను కొత్త కేబినెట్‌లో మంత్రిగా తీసుకోవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అయితే, ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా.. పార్టీలో ఆయన ఆధిపత్యం, శశికళ పట్టు తగ్గలేదని అంటున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement