మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన:భారత జవాన్ మృతి | pakistan violates ceasefire at loc | Sakshi
Sakshi News home page

మరోసారి పాక్ కాల్పుల ఉల్లంఘన:భారత జవాన్ మృతి

May 19 2014 9:11 AM | Updated on Sep 2 2017 7:34 AM

భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది.

జమ్మూకాశ్మీర్: భారత్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన పిదప పొరుగుదేశం పాకిస్తాన్ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్ లోని నియంత్రరణ రేఖ(ఎల్ఓసీ) వద్ద పాక్ భద్రతా దళాలు సోమవారం తెల్లవారుజాము ప్రాంతంలో కాల్పులు జరిపాయి. పాక్ దళాలు చిన్నపాటి ఆయుధాలతో భారత్ సరిహద్దులోకి చేరుకుని కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భారత్ కూడా ఎదురుదాడి దిగింది. ఈ ఘటనలో ఒక భారత్ జవాన్ తో పాటు, ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైయ్యాయి.
    
2003లో భారత్, పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని ఈ ఏడాది మొదటి నుంచి పాక్ తరచుగా ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల సరిహద్దుల వెంబడి కాల్పులు జరగకుండా ఉండేందుకు కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement