పాత నోట్లను మార్చే వీలులేదు | old notes cannot be changed, Supreme court clarifies to TTD | Sakshi
Sakshi News home page

పాత నోట్లను మార్చే వీలులేదు

Mar 25 2017 3:46 AM | Updated on Sep 2 2018 5:28 PM

పాత నోట్లను మార్చే వీలులేదు - Sakshi

పాత నోట్లను మార్చే వీలులేదు

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హుండీల్లో ప్రత్యక్షమవుతున్న రద్దయిన పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది.

- తిరుమల హుండీపై స్పష్టం చేసిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) హుండీల్లో ప్రత్యక్షమవుతున్న రద్దయిన పాత నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. వైఎస్సార్‌సీపీ ఎంపీ పి.వి.మిథున్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ శుక్రవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

‘‘అమ్మకం కేంద్రాల్లో రద్దయిన నోట్లను తీసుకోవడం లేదని, భక్తులు హుండీలో వేసిన పాత నోట్లను మార్పిడి చేసే వీలు కల్పించాలని టీటీడీ ఆర్బీఐని కోరింది. అయితే ప్రస్తుతం నిర్ధిష్ట బ్యాంకు నోట్ల చట్టం–2017 ప్రకారం ఈ నోట్లను డిసెంబరు 30 తర్వాత మార్చుకోవడానికి లేదని ఆర్‌బీఐ టీటీడీకి తెలిపింది’ అని మంత్రి వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement